Breaking News

శబరిమలలో కొనసాగుతున్న భక్తుల తాకిడి

Published on Mon, 12/15/2025 - 18:53

కేరళ పంబ తీర్థం స్వామియే శరణం అయ్యప్ప  ప్రతిధ్వనులతో  మారుమోగిపోతుంది. ఏ వైపు చూసినా అయ్యప్పస్వాములే దర్శనమిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం  ఇప్పటికే అధిక మెుత్తంలో స్వాములు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. ఇప్పటివరకూ అయ్యప్పస్వామిని 25 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

శబరిమలలో అయ్యప్పస్వాముల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అయ్యప్పభక్తులు పెద్దఎత్తున పంబ సన్నిధానానికి చేరుకుంటున్నారు. అయ్యప్పస్వామికి ఇరుముడి సమర్పించి తమ మెుక్కులు పూర్తి చేసుకుంటున్నారు. ప్రారంభంలో స్వామివారి దర్శనానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినా ప్రస్తుతం ఏర్పాట్లు మెరుగైనట్లు కేరళ పోలీసులు తెలిపారు. గత ఏడాది ఈ సమయం వరకూ దాదాపు 21 లక్షల మంది స్వామివారి దర్శనం చేసుకోగా ప్రస్తుతం ఆసంఖ్య 25 లక్షలు దాటిందన్నారు.

మండల పూజకోసం అయ్యప్పస్వామి (అభరణాల ఊరేగింపు) "తంగ అంకి" రథోస్థవం డిసెంబర్ 23 ప్రారంభమవుతున్నట్లు అధికారులు తెలిపారు.ఉదయం 7గంటలకు అరణ్ముల పార్థసారధి ఆలయం నుంచి బయిలుదేరి 26న అయ్యప్ప సన్నిధానం చేరుకుటుందని తెలిపారు. 27వ తేదీన అభరణాల అలంకారం అనంతరం స్వామివారికి మండల పూజ జరుగుతుందని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.

అయ్యప్ప స్వాములందరూ వారికి కేటాయించిన సమయాలలో స్వామివారి దర్శనానికి రావాలని పోలీసులు సూచించారు. అలా చేయడం ద్వారా ఇ‍బ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చని కేరళ పోలీసులు తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)