Breaking News

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. ఏడు విమానాలు రద్దు

Published on Mon, 11/18/2024 - 13:22

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. పొల్యూషన్‌ కారణంగా ఏర్పడిన పొగమంచు విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత(విజిబులిటీ) తగ్గడంతో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దాదాపు 160 విమానాలు ఆలస్యంగా నడిచాయి.

ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం  విమానాలు బయలుదేరే సమయంలో సగటున 22 నిమిషాల ఆలస్యం జరిగింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఐదు విమానాలను (జైపూర్-04, డెహ్రాడూన్-01) దారి మళ్లించారు. ప్రస్తుతం అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని విమనాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గినందున సోమవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఏడు విమానాలను రద్దు చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పడిన పొగమంచు విజిబులిటీని ప్రభావితం చేస్తోంది. ఫలితంగా విమాన షెడ్యూళ్లలో జాప్యం జరగవచ్చు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు విమాన రాకపోకల స్థితిని ఒకసారి చెక్‌ చేసుకోవాలి’ అని తెలియజేసింది. స్పైస్‌జెట్ కూడా ఇదే విధమైన సూచన చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం గాలి అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 481కి చేరింది. కాలుష్యం కారణంగా  ఏర్పడిన అధ్వాన్న పరిస్థితుల దృష్ట్యా నేటి (సోమవారం) నుంచి ఢిల్లీలో గ్రాప్‌-4 నిబంధనలను అమలు చేశారు.

ఇది కూడా చదవండి: Gujarat: ర్యాగింగ్‌కు ఎంబీబీఎస్‌ విద్యార్థి బలి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)