Breaking News

‘బుల్డోజర్‌ బాబా’ పతంగులకు డిమాండ్‌!

Published on Sun, 01/14/2024 - 09:39

పతంగులు ఎగురవేసే అభిరుచి కలిగినవారికి మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కైట్‌ ఫెస్టివల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలోని వారణాసి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వారణాసి గగనతలంలో ప్రత్యేక గాలిపటాలు సందడి చేస్తున్నాయి. 

ఈసారి వారణాసి మార్కెట్‌లో ‘బుల్డోజర్‌ బాబా’ గాలిపటాలకు అత్యధిక డిమాండ్‌  ఏర్పడింది. ఈ బుల్డోజర్ బాబా గాలిపటంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్నాయి. దీంతోపాటు బుల్డోజర్‌ బాబా బొమ్మకు కూడా చోటు దక్కింది. అంతే కాదు ఈ గాలిపటంపై భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా ముద్రించారు. దుకాణదారుడు అరవింద్‌ మాట్లాడుతూ బుల్డోజర్‌ బాబా గాలిపటాలను యువత అమితంగా ఇష్టపడుతున్నారని, అందుకే వాటిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. 

వారణాసిలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ‘బుల్డోజర్‌ బాబా’ పతంగికి డిమాండ్ ఉంది. ఈ గాలిపటం ధర 5 నుంచి 15 రూపాయల వరకు ఉంది. గాలిపటాలంటే అమితమైన ఇష్టం ఉన్న వారణాసి కుర్రాడు ఆదిత్య ఈసారి మకర సంక్రాంతికి బుల్డోజర్ బాబా గాలిపటం ఎగురవేస్తానని చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ యూపీలో తన ‘బుల్డోజర్’ చర్యలతో మాఫియా వెన్ను విరిచి, చట్టబద్ధ పాలనను తీసుకొచ్చారని ఆదిత్య పేర్కొన్నాడు. సీఎంకు మద్దతుగా తాను ఈ గాలిపటాన్ని ఎగురవేస్తానన్నారు.
ఇది కూడా చదవండి: 25 అడుగుల జాయింట్‌ కైట్‌ ఎగురుతుందిలా..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)