Breaking News

ఫుడ్‌ కోసం వెయిటింగ్‌.. కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ బాయ్‌.. ఇంత లేజీగా ఉన్నావేంటి!

Published on Thu, 07/13/2023 - 11:17

ఇంట్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రెస్టారెంట్లలో పుడ్‌ టేస్ట్‌ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పుణమ్యా అని ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌లు రాకతో చేతిలో మొబైల్‌ ఉంటే చాలు నచ్చిన పుడ్‌ ఇంటి దగ్గరకే డోర్‌ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులో మరో కోణం కూడా దాగుంది. వివిధ కారణాలతో డెలివరీ ఏజెంట్లు కస్టమర్లు ఆర్డర్‌ పెట్టిన ఆహారాన్ని అందివ్వడంతో విఫలమవుతున్నారు. అలా జరిగినప్పుడు, వారు తరచుగా సాకులు చెబుతారు. మరో విషయం ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల ఆహారాన్ని స్వయంగా తింటున్నారు కూడా. తాజాగా ఈ తరహా ఘటనే సోషల్‌మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది. 

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆన్‌లైన్‌లో పుడ్‌ ఆర్డర్‌ పెట్టి ఎదురుచూస్తుంటాడు. డెలివరీ సమయం సమీపిస్తున్న ఆహారం రాకపోవడంతో డెలివరీ ఏజెంట్‌కి ఈ విషయమై మెసేజ్‌ చేస్తాడు. ఆ సంభాషణలో..  సారీ బ్రదర్‌ మీరు ఆర్డర్‌ పెట్టిన ఫుడ్‌ని నేనే తిన్నట్లు కస్టమర్‌కు మెసేజ్‌ చేస్తాడు. దీంతో రూల్స్‌ ఉల్లంఘించినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఏజెంట్‌కు కస్టమర్‌ మెసేజ్ చేశాడు. అందుకు ఏజెంట్ వెటకారంగా స్పందిస్తూ, "మీరు దానిని నిరూపించలేరు, మిత్రమా అంటూ బదులిచ్చాడు.

డెలివరీ ఏజెంట్ తమ హౌసింగ్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించలేదని నిరూపించడానికి తమ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొంటాడు కస్టమర్‌. అయితే, ఏజెంట్ కస్టమర్‌ను ఫుడ్‌ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టావ్‌ ఇంత సోమరిగా ఉన్నావేంటి అని పిలవడంతో వీరి మధ్య సంభాషణ కాస్త సీరియస్‌గా మారింది. చివరిలో ఆ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారం అద్భుతంగా ఉందని, అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిన్నానని నిర్ధారిస్తూ సంభాషణను ముగించాడు. ప్రస్తుతం ఈ చాట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్‌ చేసిన పనికి మండిపడుతున్నారు.

చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)