Breaking News

Delhi University: లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రిన్సిపాల్ సస్పెండ్‌

Published on Mon, 09/22/2025 - 11:55

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రామానుజన్ కళాశాల ప్రిన్సిపాల్‌ సింగ్‌ను లైంగిక వేధింపుల  ఆరోపణలతో సస్పెండ్ చేశారు.  దీనిపై తదుపరి ​‍ప్రక్రియ కోసం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ముందు ఉంచుతామని డీయూ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ చెప్పారు. నిజనిర్ధారణ కమిటీ, ముగ్గురు సభ్యుల పాలకమండలి ప్యానెల్ ఫిర్యాదును పరిశీలించాక ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలలో వాస్తవం ఉందని అన్నారు.

విచారణ సజావుగా, నిస్పాక్షికంగా కొనసాగేందుకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్పిపాల్‌ సింగ్‌ను ఈ వ్యవస్థ నుండి దూరంగా ఉండేలా చూసేందుకు సస్పెండ్‌ చేశామని యోగేష్ సింగ్ తెలిపారు. అయితే సదరు ప్రిన్సిపాల్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. అవి కల్పితమైనవనిగా పేర్కొన్నారు. కాగా ప్రిన్సిపాల్‌ సింగ్‌ ప్రధానమంత్రి కార్యాలయ ఫిర్యాదుల విభాగం, డీయూ వైస్ ఛాన్సలర్‌కు రాసిన లేఖలలో ఈ ఫిర్యాదు పూర్తిగా పదోన్నతికి సంబంధించిన సమస్య అని, అయితే దీనిని లైంగిక వేధింపుల కేసుగా మార్చడానికి చేసిన కుట్ర పన్నారని ఆరోపించారు.

అసంపూర్ణ డాక్యుమెంటేషన్ కారణంగా తన పదోన్నతిని అంతర్గత నాణ్యత హామీ సెల్ ఆమోదించలేదని, పదోన్నతి అభ్యర్థనను వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని  ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.ఈ విషయంలో తాను తలొగ్గకపోవడంతోనే తనను లైంగిక వేధింపుల కేసులో ఇరికించారని ప్రిన్సిపాల్‌ సింగ్ ఆరోపించారు. యూజీసీ నియమాల ప్రకారం ఫిర్యాదును అంతర్గత ఫిర్యాదుల కమిటీకి సమర్పించలేదని, దీనికి బదులుగా కళాశాల పాలక మండలికి, తరువాత డీయూ వీసీకి పంపారని ప్రిన్సిపాల్‌ ఆరోపించారు. కాగా ఈ అంశాన్ని ఐసీసీ ముందు ఉంచుతామని, ఇప్పటివరకు తాము తీసుకున్న చర్యలు నిబంధనల పరిధిలోనే  ఉన్నాయని డీయూ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్  స్పష్టం చేశారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)