Breaking News

ఎల్గార్‌ పరిషత్‌ కేసులో ప్రొఫెసర్‌ హనీబాబుకు బెయిల్‌ 

Published on Fri, 12/05/2025 - 05:21

ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ హనీబాబుకు బెయిల్‌ మంజూరు అయ్యింది. ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హనీ బాబు.. విచారణ లేకుండానే ఐదేళ్లకు పైగా జెలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ మొదటి వారంలో ఈ కేసులో విచారణ పూర్తి చేసిన జస్టి‹స్‌ ఎ.ఎస్‌.గడ్కరీ, ఆర్‌.ఆర్‌.¿ోంస్లేలతో కూడిన డివిజన్‌ బెంచ్, ఆయనను విడుదల చేయాలని, లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌ను సమరి్పంచాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి ఈ ఉత్తర్వును నిలిపివేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైకోర్టును కోరింది. 

బాబు ఇప్పటికే విచారణలేకుండానే సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారని, విచారణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేనందున ఎన్‌ఐఏ అప్పీలును తిరస్కరించింది. ఆయన పూర్తి పేరు హనీబాబు ముసలియారీ్వట్టిల్‌ తరయిల్‌. యూపీలోని గౌతమ్‌ బుద్ధ నగర్‌కు చెందిన వ్యక్తి. 2017 డిసెంబర్‌ 31న పూణేలోని శనివార్‌వాడలో కబీర్‌కళా మంచ్‌ నిర్వహించిన ఎల్గార్‌ పరిషత్‌ కార్యక్రమంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2020 జూలైలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిషేధిత సీపీఐ(ఎంఎల్‌) నాయకుల సూచనల మేరకు మావోయిస్టు కార్యకలాపాలు, భావజాలాన్ని హనీబాబు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. 59 ఏళ్ల హనీ బాబు అప్పటి నుంచి తలోజా జైలులో ఉన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)