Breaking News

మహిళకు ఫ్లయింగ్‌ కిస్‌.. ఆప్‌ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Published on Wed, 02/05/2025 - 08:36

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్‌ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆప్‌ ఎమ్మెల్యే దినేష్‌ మోహానియా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించారు. అనుచిత హావభావాలు, ఆమెకు ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్‌ నేతపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు దినేష్ మోహానియా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆప్‌కు ఓటు వేయాలని ఓటర్లు కోరారు. ఈ క్రమంలో ర్యాలీలో ఓ మహిళతో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను చూస్తూ సైగలు చేశారు. అనంతరం, ఆమెకు ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారు. దీంతో​, ఆయన ప్రవర్తన వివాదాస్పందంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తీరుపై ఆ‍గ్రహం వ్యక్తం చేసిన మహిళ.. తాజగా పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టి తెలిపారు.

 

ఇక, ఎన్నికల్లో ర్యాలీలో దినేష్ మోహానియాకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. దినేష్ మోహానియా సంగం విహార్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మరోసారి తన నియోజకవర్గం నుండి పోటీలో నిలిచారు.

మరోవైపు.. మోహానియా వివాదాలకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం, తన నియోజకవర్గంలోని రోడ్డు పక్కన పండ్ల వ్యాపారిపై దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా తన వాదనను సమర్థించుకుంటూ, పండ్ల వ్యాపారిని అక్కడి నుండి వెళ్లిపోవాలని మాత్రమే చెప్పినట్టు తెలిపారు. ఎందుకంటే అతను మురుగు కాలువ ముందు తన దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, దీనివల్ల పౌర కార్మికుల పనికి ఆటంకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)