Breaking News

ట్రెండ్ సెట్టింగ్ ఐడియా..ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసుల వినూత్న ప్రయోగం..

Published on Mon, 06/12/2023 - 10:51

ఢిల్లీ: పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తుంటారు. దీంతో చలాన్లను ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంటారు పోలీసులు. వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడానికి పోలీసులు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సారి ఢిల్లీ పోలీసుల వినూత్నంగా ఆలోచించారు. పబ్లిక్ ఆలోచనలకు సరిపోయే విధంగా ఓ రీల్ రూపంలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇచ్చారు. ఇంతకీ ఆ రీల్‌లో ఏముందంటే..?

ఓ అందమైన అమ్మాయి పెళ్లికూతురుగా ముస్తాబైంది. ఖరీదైన దుస్తులు, నగలు ధరించింది. హెల్మెట్ లేకుండా స్కూటీని నడుపుతోంది. 'వారీ వారీ జాన్' పాటను ఎంజాయ్ చేస్తూ.. అందుకు తగ్గట్టుగా మూమెంట్స్ ఇస్తూ రైడింగ్ చేస్తున్నట్లుగా వీడియో ఉంది. కానీ చివర్లో అసలు ట్విస్టు ఎదురైంది. అలా స్కూటీ నడుపుతున్న ఆ అమ్మాయికి పోలీసులు రూ.6000 ఫైన్ విధించారు. హెల్మెట్ లేనందుకు రూ.1000, లైసెన్స్ లేనందుకు రూ.5000 చొప్పున వేశారు. జరిమానాకు సంబంధించిన 'పే స్లిప్‌'లు వీడియో చివర్లో చూపించారు. సదరు వీడియోను ఢిల్లీ పోలీసు తమ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానా తప్పదు అని తెలిపే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. పోలీసుల వినూత్న ఆలోచనలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు జోహార్లు అంటూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఐడియాలు ఎక్కడ నుంచి వస్తాయయ్యా? అంటూ ఫన్నీగా స్పందించారు.

ఇదీ చదవండి:బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)