Breaking News

Delhi: ఆ రోజు నుంచే మహిళల ఖాతాలకు రూ. 2,500

Published on Thu, 02/20/2025 - 13:09

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(Rekha Gupta) బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలోని  అర్హులైన మహిళలకు ప్రతీనెల రూ. 2,500 అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై నూతన సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటుందన్నారు. మహిళలకు మార్చి 8న రూ.2,500 మొత్తాన్ని వారి ఖాతాల్లోకి జమచేయనున్నట్లు తెలిపారు.  

ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) మొన్నటి ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ. 2,100 ఇస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో బీజేపీ రూ. 2,500 ఇస్తామని ప్రకటించింది. బుధవారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎంగా రేఖా గుప్తా పేరును ప్రకటించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందన్నారు.  

ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలివే..

మహిళలకు నెలకు 2500 రూపాయలు

రూ. 500కే సిలిండర్‌. హోలీ, దీపావళికి  ఒ​క్కో సిలిండర్‌ ఉచితం

గర్భిణీ స్త్రీలకు రూ.21 వేలు సాయం. ఆరు పోషకాహార కిట్లు అందజేత

మురికివాడల్లోని ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం

ఢిల్లీ పౌరులందరికీ  ఉచితంగా రూ. 10 లక్షల మేరకు విలువైన వైద్య చికిత్స

ప్రధాని నరేంద్ర మోదీ కలను సాకారం చేయడం అనేది ఢిల్లీలోని 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల బాధ్యత అని రేఖా గుప్తా మీడియాతో అన్నారు. మహిళలకు ఆర్థికంగా సహాయం అందించే మా వాగ్దానాలన్నింటినీ మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. మార్చి 8 నాటికి డబ్బు ఖచ్చితంగా వారి ఖాతాలకు బదిలీ చేస్తాం’ అని అన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly elections) 70 స్థానాలకు గాను 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దశాబ్దాల ఆప్ పాలనకు బీజేపీ ముగింపు పలికింది.

ఇది కూడా చదవండి: Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)