Breaking News

పాసుపోర్టులో తండ్రి పేరుపై హైకోర్టు కీలక తీర్పు

Published on Tue, 05/02/2023 - 11:43

ఢిల్లీ: పాస్‌పోర్టులో తండ్రి పేరుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బిడ్డ జన్మించకముందే భార్యను, బిడ్డను వదిలివెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ప్రత్యేక పరిస్థిత్లుల్లో తండ్రి పేరును తొలగించడంతో​ పాటుగా ఇంటి పేరును కూడా మార్చుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. 

వివరాల ప్రకారం.. ఓ తల్లి, ఆమె కొడుకు.. తండ్రి నుంచి విడిపోయి జీవిస్తున్నారు. అయితే, భర్త తోడు లేకుండా ఒంటరిగా బిడ్డను పెంచిన ఓ మహిళ తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టు విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో తన బిడ్డ కడుపులో ఉండగానే తన భర్త ఆమెను వదిలివెళ్లిపోయాడని.. ఆ తర్వాత శిశువు బాధ్యతలు పూర్తిగా తానే చూసుకున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా, తన కుమారుడి మంచి చెడ్డలు తానే చూసుకుంటున్నట్టు, పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించాలని ఆమె పిటిషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో తండ్రి పేరు లేకుండా  కొత్త పాస్‌పోర్టు జారీ చేయాలని ధర్మసనాన్ని కోరారు. దీంతో, ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన అనంతరం.. న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్ కీలక తీర్పు వెలువరించారు. ‘తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది. మైనర్ కుమారుడి పాస్‌పోర్టు నుంచి తండ్రి పేరు తొలగించి కొత్తది జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరును తొలగించడంతో పాటు ఇంటిపేరును కూడా మార్చుకోవచ్చు’ అని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో వారిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)