Breaking News

అమెరికా ఖర్చులు వేరు.. ఢిల్లీ పరిస్థితులు వేరు

Published on Sat, 01/03/2026 - 10:03

న్యూఢిల్లీ: వైవాహిక వివాదాల కేసుల్లో బాధితురాలికి చెల్లించాల్సిన మధ్యంతర భరణాన్ని కొలత కొలిచినట్టుగా నిర్దిష్టంగా లెక్కించడం అసాధ్యమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. 2023 నాటి విడాకుల కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ అమిత్‌ మహాజన్‌ ఈ మేరకు స్పష్టం చేశారు. భర్త విదేశీ కరెన్సీలో సంపాదిస్తున్నాడన్న ఒకే ఒక్క కారణంగా, దాన్ని నేరుగా రూపాయల్లోకి మార్చి ఫలానా మొత్తం ఇవ్వాల్సిందేనంటూ తేల్చలేమని పేర్కొన్నారు. 

ఫ్యామిలీ కోర్టు అప్పట్లో నెలకు రూ.50 వేల మధ్యంతర భరణాన్ని నిర్ధారించింది. దాన్ని పెంచాలని భార్య, మళ్లీ సమీక్షించాలని భర్త వేర్వేరు పిటిషన్లు వేశారు. ‘భర్త అమెరికాలో ఉంటున్నాడు. అమెజాన్‌ కంపెనీలో ఏటా రూ.176 కోట్లు సంపాదిస్తున్నట్టు భార్య చెబుతోంది. పైగా ఆమె నిరుద్యోగి. కానీ ఆయన ఖర్చులు కూడా అక్కడికి తగ్గట్టుగానే ఉంటాయన్నది మర్చిపోరాదు. వాటిని ఢిల్లీ పరిస్థితులతో పోల్చలేం కదా! అయినా మధ్యంతర విచారణ దశలోనే ఆర్థిక విషయాలను మరీ లోతుగా చూడాల్సిన అవసరం లేదు’అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే, మధ్యంతర భరణాన్ని నెలకు రూ.లక్షకు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు!   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)