Breaking News

లైంగికదాడి బాధితులకు వైద్యం నిరాకరణ నేరమే

Published on Wed, 12/25/2024 - 08:23

న్యూఢిల్లీ: లైంగిక హింస, యాసిడ్‌ దాడి వంటి కేసుల బాధితులకు వైద్యం అందించే విషయమై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయా కేసుల బాధితులకు వైద్యం నిరాకరించడమే నేరమేనని స్పష్టం చేసింది. అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితిలో గుర్తింపు పత్రాలు తేవాలంటూ ఆస్పత్రులు, వైద్య నిపుణులు పట్టుబట్టడం సరికాదని పేర్కొంది.

 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇటువంటి బాధితులకు ఉచితంగా వైద్య సాయం అందించాల్సిందేనని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంది. లేనట్లయితే బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్, జస్టిస్‌ అమిత్‌ శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం హెచ్చరించింది. ఆస్పత్రులతోపాటు వైద్య చికిత్సలు అందించే అన్ని రకాల కేంద్రాలకు ఇదే సూత్రం వర్తిస్తుందని వివరించింది. 

ఆయా కేసుల బాధితులకు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే కాదు, అవసరమైన ఇతర నిర్థారణ పరీక్షలు, ఆస్పత్రిలో చేర్చుకోవడం, ఔట్‌ పేషెంట్‌గా వైద్యం అందించడం, సర్జరీ, భౌతిక, మానసిక కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ వంటి సేవలను కూడా అందించాలని తెలిపింది. తక్షణమే ఈ విషయాన్ని వైద్యులు, పరిపాలన సిబ్బంది, అధికారులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది వంటి అందరికీ చేరేలా ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడి, లైంగికదాడి మైనర్‌ బాధితులు, ఇతరులకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని కోరింది.   

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)