Breaking News

ఢిల్లీ కాలుష్యం.. తందూర్‌లపై నిషేధం

Published on Tue, 12/16/2025 - 11:58

సాక్షి,ఢిల్లీ: రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తందూరి వంటకాలను తయారు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో బొగ్గు లేదా కట్టెలతో నడిచే తందూర్‌లను పూర్తిగా నిషేధించింది. ఇకపై అన్ని వాణిజ్య సంస్థలు విద్యుత్, గ్యాస్ ఆధారిత లేదా శుభ్రమైన ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

బొగ్గు, కట్టెలతో నడిచే తందూర్‌లు ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో వాడకూడదని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు Air (Prevention and Control of Pollution) Act, 1981లోని సెక్షన్ 31(A) కింద జారీ అయ్యాయి.

మంగళవారం ఉదయం 10 గంటలకు ఆనంద్ విహార్, ITO ప్రాంతాల్లో AQI 400 వద్ద నమోదైంది. ఇది ప్రమాదకరమైన స్థాయిగా పరిగణించబడుతుంది. కాలుష్యం తీవ్రత పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) – Stage IV (Severe+) అమల్లోకి వచ్చింది. 



బయోమాస్, వ్యర్థాలు లేదా బొగ్గు వంటి పదార్థాలను బహిరంగంగా కాల్చడం పూర్తిగా నిషేధం. కాలుష్య స్థాయి ప్రమాదకరంగా పెరగడంతో అన్ని అత్యవసర చర్యలు తక్షణమే అమలు చేయాలని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) నిర్ణయించింది. ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రెస్టారెంట్ వ్యాపారాలపై ప్రభావం చూపనున్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)