Breaking News

భాయ్‌.. అన్‌పార్లమెంటరీ పదమా?

Published on Thu, 03/27/2025 - 14:31

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఇవాళ మంత్రి పర్వేష్‌ వర్మ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష నేత అతిషీని ఉద్దేశించి మంత్రి పర్వేష్‌ వర్మ చేసిన ‘భాయ్‌’ వ్యాఖ్యలపై ఆప్‌ ఆందోళనకు దిగింది. అతిషీకి వర్మ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేష్‌ వర్మ ప్రశ్నోత్తరాల టైంలో మాట్లాడుతూ.. గతేడాది బడ్జెట్‌లో తీర్థయాత్ర పథకానికి రూ.80 కోట్ల బడ్జెట్‌ కేటాయించినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేవలం పబ్లిసిటీ మాత్రమే చేశారంటూ ఆరోపణలు గుప్పించారు.

ఈ క్రమంలో.. అతిషీ సహా ఆప్‌ ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. ఈ క్రమంలో వర్మ అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘ఎక్కడి నుంచి ఈమెను తెచ్చారు భాయ్‌’’ అంటూ అతిషిని ఉద్దేశించి ఆప్‌ ఎమ్మెల్యేలతో అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది.

వర్మ అతిషిపై అన్‌పార్లమెంటరీ పదజాలం ఉపయోగించారని ఆప్‌ నిరసనకు దిగింది. అయితే భాయ్‌ అనడంలో తప్పేముందంటూ వర్మ ఆప్‌ ఎమ్మెల్యేలను ప్రశ్నించగా.. స్పీకర్‌ విజేందర్‌ గుప్తా సైతం మంత్రికి మద్దతుగా నిలిచారు. స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా ఆప్‌ సభ్యులు శాంతించకపోవడంతో మార్షల్స్‌ సాయంతో ఎమ్మెల్యేలు విశేష్‌ రవి, కులదీప్‌ కుమార్‌లను బయటకు పంపించారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు