Breaking News

విమాన ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అడ్వైజరీ!

Published on Sun, 05/11/2025 - 12:38

ఢిల్లీ: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయం అధికారులు ప్రయాణికులకు ఓ అడ్వైజరీని జారీ చేశారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.

వివరాల ప్రకారం.. భారత్‌, పాక్‌ మధ్య కాల్పులు, దాడులు నిలిచిపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఉదయం ఓ అడ్వైజరీని జారీ చేశారు. విమానాశ్రయంలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని.. ఎయిర్‌స్పేస్ డైనమిక్స్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల మేరకు పెరిగిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌, విమానాల షెడ్యూల్‌లో సర్దుబాట్ల సందర్భంగా తనిఖీ కేంద్రాల్లో ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది.

ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ కమ్యూనికేషన్‌ ఛానెల్స్‌తో టచ్‌లో ఉండాలని.. క్యాబిన్, చెక్-ఇన్ బ్యాగేజీకి సంబంధించి సూచించిన మార్గదర్శకాలను పాటించాలని, వీలైనంత వరకు ముందుగానే చేరుకొని భద్రతా సిబ్బందికి సహకరించాలని సూచించింది. ఎయిర్‌లైన్స్‌ లేదంటే ఢిల్లీ విమానాశ్రయం వెబ్‌సైట్‌లో విమానం స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని చెప్పింది. పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు.. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మే 15 వరకు 32 విమానాశ్రయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొంది.

ఈ జాబితాలో ఆదంపూర్‌, అంబాలా, అమృత్‌సర్, అవంతిపొర, బటిండా, భుజ్, బికనీర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పాటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, సిమ్లా, శ్రీనగర్, థోయిస్ ఉత్తర్‌లై ఉన్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)