Breaking News

మందపాటి రగ్గు కప్పుకున్నా చలి తగ్గడంలేదా.. కారణమిదే..

Published on Sat, 12/21/2024 - 11:39

శీతాకాలంలో చలిగా అనిపించడం సహజం. దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరిస్తారు. రాత్రిపూట మందపాటి రగ్గులు కప్పుకుంటారు. అయినప్పటికీ కొందరు తమకు ఏమ్రాతం చలి తగ్గలేదని చెబుతుంటారు. పైగా కాళ్లు చేతులు, చల్లబడిపోతున్నాయని, చలికి తట్టుకోలేకపోతున్నామని అంటుంటారు. అయితే ఇందుకు వారి శరీరంలో వివిధ విటమిన్లు, పోషకాల లోపం కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చలికి కారణమే..

మెగ్నీషియం లోపం: మెగ్నీషియం లోపం వల్ల కండరాల తిమ్మిర్లు, నొప్పులు తలెత్తుతాయి. రక్త ప్రసరణ సరిగా జరగదు. ఫలితంగా ఇది చేతులు, కాళ్లు చల్లబడేందుకు కారణంగా నిలుస్తుంది.  తృణధాన్యాలు, ఆకు కూరలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం లేదా మెగ్నీషియం సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

ఇనుము: శరీరంలో ఐరన్ లేనప్పుడు, అది రక్తహీనతకు కారణమవుతుంది. ఫలితంగా అలసట, నీరసంతోపాటు చేతులు, కాళ్ళు చల్లగా మారుతాయి. ఆహారంలో లీన్ మీట్, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, ఆకు కూరలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వలన ఐరన్ లోపాన్ని నివారించవచ్చు.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రక్త ప్రసరణలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపం రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. ఫలింగా చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది.

విటమిన్ బీ12: విటమిన్ బీ12 శరీరంలో రక్త కణాలను తయారు చేయడంలో, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బీ 12 లోపం కండరాల దృఢత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ లోపాన్ని తగ్గించేందుకు చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులతోపాటు బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి.

విటమిన్ డి: ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో, శరీరంలో కాల్షియం స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం బలహీనమైన రక్త ప్రసరణకు కారణమవుతుంది. ఈ లోపం చేతులు, కాళ్లు చల్లబడేలా  చేస్తుంది. ఎండలో బయట కాస్త సమయం గడపడం, చేపలు, గుడ్లు, బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. తద్వారా శరీరంలో విటమిన్ డి స్థాయి కొనసాగుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

ఇది కూడా చదవండి: Year Ender 2024: విమాన ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)