Breaking News

నూతన తేజస్సు

Published on Fri, 09/26/2025 - 04:51

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) మరింత శక్తివంతంగా మారనుంది. అత్యాధు నిక యుద్ధ విమానాల రాకతో ఐఏఎఫ్‌ కొత్త తేజస్సును సంతరించుకోనుంది. ఏకంగా 97 తేజస్‌ ఎంకే–1ఏ తేలికపాటి యుద్ధ విమా నాల(ఎల్‌సీఏ) కొనుగోలుకు హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో భార త రక్షణ శాఖ గురువారం ఒప్పందం కుదు ర్చుకుంది. ఈ ఒప్పందం విలువ పన్నులు మినహా రూ.62,370 కోట్లు.

తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నెల రోజుల క్రితమే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. 2027–28 నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రారంభమవు తుంది. ఆరేళ్లలోగా మొత్తం విమానాలను రక్షణ శాఖకు హెచ్‌ఏఎల్‌ అప్పగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో 68 ఫైటర్‌ జెట్లు, 29 ట్విన్‌ సీటర్‌ విమానాలు ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించాయి.

ఏటా 11,750 మందికి ఉద్యోగాలు, ఉపాధి  
ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్‌తో ఇలాంటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి. 2021 ఫిబ్రవరిలో రూ.48,000 కోట్లతో 83 తేజస్‌ ఎంకే–1ఏ ఫైటర్‌ జెట్ల కొనుగోలు కోసం హెచ్‌ఏఎల్‌తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. 2021 కంటే ఈసారి తయారు చేయబోతున్న ఫైటర్‌ జెట్లు మరింత ఆధునికమైనవి. ఇందులో 64 శాతం దేశీయ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానమే ఉంటుంది. 

అదనంగా 67 పరికరాలు చేర్చ బోతున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ను చేర్చనున్నారు. ప్రతి ఏటా ప్రత్యక్షంగా, పరోక్షంగా 11,750 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తా యని అంచనా. మొత్తం ఆరేళ్లపాటు ఒప్పందం అమల్లో ఉంటుంది. ఆత్మనిర్భర్‌ లక్ష్యాని కి ఇదొక ప్రతీక అని అధికార వర్గాలు అభి వర్ణించాయి. ఆరు దశాబ్దాలకుపైగా సేవ లందించిన మిగ్‌–21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతూ వాటి స్థానంలో తేజస్‌ ఎంకే–1ఏ ఫైటర్‌ జెట్లను ప్రవేశపెట్టబో తున్నారు. 

నేడు మిగ్‌–21 జెట్లకు వీడ్కోలు
ఘనమైన చరిత్ర కలిగిన మిగ్‌–21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. శుక్రవారం  బైబై చెప్పబో తున్నారు. చండీగఢ్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ వేదిక కానుంది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)