Breaking News

79వేల కోట్ల సైనిక హార్డ్‌వేర్‌ కొనుగోలుకు ఆమోదం

Published on Tue, 12/30/2025 - 05:33

న్యూఢిల్లీ: సైన్యం సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ.79,000 కోట్ల విలువైన క్షిపణులు, ఆయుధాలు, హార్డ్‌వేర్‌ కొనుగోళ్లకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సోమవారం సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. 

తక్కువ స్థాయి తేలికైన రాడార్లు, పినాకా రాకెట్‌ వ్యవస్థ కోసం లాంగ్‌–రేంజ్‌ గైడెడ్‌ రాకెట్‌ మందుగుండు సామగ్రి, ఇంటిగ్రేటెడ్‌ డ్రోన్‌ డిటెక్షన్, ఇంటర్‌డిక్షన్‌ సిçస్టమ్, ఆర్మీ ఫిరంగి రెజిమెంట్ల కోసం లోయిటర్‌ మునిషన్‌ వ్యవస్థల కొనుగోలుకు కూడా ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడికి లోయిటర్‌ మునిషన్‌ ఉపయోగిస్తారు. చిన్న పరిమాణంలో, తక్కువ ఎగిరే మానవరహిత వైమానిక వ్యవస్థలను తక్కువ స్థాయి తేలికైన రాడార్లు గుర్తించి, ట్రాక్‌ చేస్తాయి. 

సుదీర్ఘ లక్ష్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పినాకా రాకెట్, వ్యవస్థల పరిధి, ఖచ్చితత్వాన్ని పెంచడానికి లాంగ్‌ రేంజ్‌ గైడెడ్‌ రాకెట్లను కొనుగోలు చేయనున్నారు. వ్యూహాత్మక యుద్ధ ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లో భారత సైన్య కీలకమైన ఆస్తులను ఇంటిగ్రేటెడ్‌ డ్రోన్‌ డిటెక్షన్, ఇంటర్‌డిక్షన్‌ సిస్టమ్‌ రక్షిస్తుంది. 

ఇక హిందూ మహాసముద్ర ప్రాంతంపై నిరంతర నిఘా కోసం పెద్ద సంఖ్యలో రిమోట్‌ పైలట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ (ఆర్‌పీఏఎస్‌)లను లీజుకు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆటోమేటిక్‌ టేకాఫ్‌ ల్యాండింగ్‌ రికార్డింగ్‌ సిస్టమ్‌ ఏరోస్పేస్‌ వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుందని, ఆస్ట్రా ఎమ్‌– ఐఐ క్షిపణులు ప్రత్యర్థి విమానాలను తటస్థీకరించే యుద్ధవిమానాల సామర్థ్యాన్ని పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.  
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)