Breaking News

నేడు రికార్డుకు సిద్ధమవుతున్న దీపోత్సవం

Published on Wed, 10/30/2024 - 06:58

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం నేడు (అక్టోబర్‌ 30) మరో రికార్డుకు వేదికకానుంది. ఈ  రోజు అయోధ్యలో ఎనిమిదో దీపోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది.

అయోధ్యలో ఈరోజు సాయంత్రం జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వెలుగుల పండుగలో అయోధ్యలోని సరయూ తీరం వెంబడి రామ్‌ కీ పైడీతో సహా 55 ఘాట్‌ల వద్ద 25 లక్షల దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అయోధ్య దీపోత్సవం మరో రికార్డును సాధించనుంది.

దీపోత్సవం కోసం స్థానికులు అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. అక్టోబర్ 30న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  రామ్‌ కీ పైడీలో తొలి దీపం వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో లేజర్ షో, బాణసంచా కాల్చడం, రాంలీల ‍ప్రదర్శనలు ఉండనున్నాయి.

ఈ ఏడాది జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం జరిగింది. దీనితరువాత జరుగుతున్న తొలి దీపోత్సవం ఇదే కావడంతో స్థానికుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈరోజు జరిగే దీపోత్సవంలో సరయూ ఒడ్డు, రామ్‌కీ పైడీ, ఇతర 55 ఘాట్‌లలో 28 లక్షల దీపాలను ఏర్పాటు చేశారు. వీటిని వెలిగించి పాత రికార్డును బద్దలు కొట్టడం ద్వారా గిన్నిస్ బుక్‌లో కొత్త రికార్డు నమోదు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది.

గత ఏడాది దీపోత్సవంలో 22 లక్షల 23 వేల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈసారి జరుగుతున్న దీపోత్సవంలో అవధ్‌ విశ్వవిద్యాలయంతోపాటు ఇతర కళాశాలలకు చెందిన 30 వేల మంది విద్యార్థులు తమ సేవలు అందిస్తున్నారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  తొలిసారిగా దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 

ఇది కూడా చదవండి: ఉక్కు ఉద్యోగుల ఆకలి కేకలు

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)