Breaking News

తెలంగాణలో అడుగంటుతున్న జలాశయాలు

Published on Wed, 07/15/2026 - 03:12

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలంగాణలోని ప్రధాన జలాశయాలు అడుగంటుతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, వరద ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) జూలై 9 నాటి వివరాలతో విడుదల చేసిన తాజా వారపు బులెటిన్‌ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ తెలంగాణ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో కేవలం 12.92 శాతానికి పరిమితమయ్యాయి. 

సాగు, తాగునీటి అవసరాలపై ఈ గణాంకాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం కేవలం 1.261 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల) నీరు మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 30.31 శాతం నిల్వలుండగా, పదేళ్ల సాధారణ సగటు 19.26 శాతంగా నమోదయ్యేది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఏకంగా 33 శాతం మేర నీటి తగ్గుదల రికార్డయింది. 

కీలక ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యతను పరిశీలిస్తే నాగార్జునసాగర్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ నిల్వ కేవలం 3.62 శాతానికి పడిపోయింది. సింగూర్‌లో 15.56 శాతం, శ్రీరాంసాగర్‌లో 18.80 శాతం చొప్పున నీరు మాత్రమే అందుబాటులో ఉంది. కడెం ప్రాజెక్టు సాధారణ నిల్వలో కేవలం 21.85 శాతంతో తీవ్ర నీటి లోటును ఎదుర్కొంటోంది. లోయర్‌ మానేర్‌లో 26.02 శాతం, జూరాలలో 33.33 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)