Breaking News

జైల్లో స్టార్‌ హీరో విలాసాలు.. కాఫీ కప్పు,సిగరెట్‌తో..

Published on Sun, 08/25/2024 - 20:09

ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగరెట్‌ను గుప్పు గుప్పు మని పీలుస్తున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఏడాది జూన్‌ 8,2024 తన ప్రియురాలు పవిత్ర గౌడ అశ్లీల పంపించాడని రేణుకాస్వామి (28) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి జైలు శిక్షను అనుభవిస్తున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే ఆ ఫొటో. అభిమాని హత్య కేసులోని ఏ1 దర్శన్‌తో పాటు ఇతర నిందితులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, దర్శన్ బెయిల్ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు.

ఈ తరుణంలో దర్శన్‌ పరప్పన అగ్రహార జైలు గార్డెన్‌లో ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శన్‌తో పాటు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ,మరో ఖైదీ మేనేజర్ నాగరాజ్ ఉన్నారు.

ఇక ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్‌ మీడియాలో షేర్‌ అవ్వడంతో క్షణాల్లో వైరలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో జైల్లో నిబంధనలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న దర్శన్‌కు వీవీఐపీ ట్రీట్మెంట్‌ అందుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు జైలు గార్డెన్‌లో తోటి నేరస్తులతో కబర్లు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, తాగేందుకు కాఫీ, సిగరెట్‌లు అందించడమేనని అంటున్నారు. మరి ఈ ఫొటోపై పరప్పన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)