Breaking News

బస్తర్‌లో 10 వేల రేడియో సెట్ల పంపిణీ

Published on Mon, 10/06/2025 - 06:29

న్యూఢిల్లీ/బిజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు 10 వేలకు పైగా రేడియో సెట్లను ప్రజలకు పంపిణీ చేసింది. జాతీయ స్థాయి పరిణామాలను వారికి అందజేయడం, మావోయిస్టుల సైద్ధాంతిక ప్రభావం నుంచి స్థానికులను దూరం చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో వీటిని అందజేశామని సీఆర్‌పీఎఫ్‌ తెలిపింది. 

గడిచిన నాలుగు నెలల కాలంలో దట్టమైన బస్తర్‌ అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో వందలాది చిన్నాపెద్దా సమావేశాలను పూర్తి చేసినట్లు వివరించింది. ఇందుకోసం బస్తర్‌ ప్రాంతంలోని ఏడు జిల్లాల కోసం హోంశాఖ రూ. 1.62 కోట్లు కేటాయించిందని సీఆర్‌పీఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సుమారు రూ.1,500 ఖరీదు చేసే ఈ రేడియోలు బ్యాటరీలతోపాటు కరెంట్‌ సాయంతోనూ పనిచేస్తాయన్నారు. 

మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల్లో 180 కంపెనీల బలగాల సాయంతో మొత్తం 10,800 రేడియో సెట్లను అందజేశామన్నారు. కుటుంబానికి ఒకరు చొప్పున కనీసం 54 వేల మందిని మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడేయటమే తమ లక్ష్యమని చెప్పారు. 2026 మార్చికల్లా మావోయిస్టులను పూర్తిగా ఏరిపారేయడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు. 

ఇందులో భాగంగానే సంక్షేమ, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’సహా రేడియోలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలను గురించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని వారికి వివరిస్తున్నామని తెలిపారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో మరిన్ని రేడియో టవర్లను ఏర్పాటు చేసి, స్థానికులకు రేడియో ప్రసారాలను అందుబాటులోకి తేవాలని హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)