Breaking News

Delhi Airport: రన్‌వే వద్ద భారీ క్రేన్‌.. ప్రమాదంలో పడ్డ విమానాలు

Published on Sat, 01/06/2024 - 12:41

న్యూఢిల్లీ: నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు విధినిర్వహణలో భాగంగా చేసిన ఓ పని వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్‌లో పడేసింది. రోడ్డు నిర్మాణం కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్‌ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్‌ కారణంగా విమానాలకు ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్‌ సిస్టమ్‌(ఐఎల్‌ఎస్‌) సిగ్నల్‌ అందలేదు. ఎయిర్‌పోర్టు వద్ద దట్టంగా పొగమంచు ఏర్పడినపుడు విమానాలకు విజిబిలిటీ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో వాటి సేఫ్‌ ల్యాండింగ్‌కు ఐఎల్‌ఎస్ సిగ్నల్‌ నావిగేషన్‌ ఉపయోగపడుతుంది.

ఈ విషయం వారం తర్వాత అధికారుల దృష్టికి రావడంతో వారు కంగారుపడ్డారు. క్రేన్‌ కారణంగా సిగ్నల్‌ సరిగా అందకపోవడంతో 100 దాకా విమానాలు గత వారం ఆలస్యంగా ల్యాండ్‌ అవడమే కాకుండా కొన్ని విమానాలను ఏకంగా మళ్లించే పరిస్థితి ఏర్పడిందని అధికారులు నిర్ధారించారు. ‘ఐఎల్‌ఎస్‌ సిగ్నల్‌లో అంతరాయం వల్ల కొన్ని విమానాలు రన్‌వే సెంటర్‌ లైన్‌ నుంచి 10 నుంచి 20 ఫీట్ల దూరం పక్కకు ల్యాండ్‌ అయ్యాయి’అని ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు తెలిపారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు అధికారులు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించకుండా ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ-జైపూర్‌ నేషనల్‌ హైవేకు అనుసంధానించే అర్బన్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్డును ఢిల్లీ ఎయిర్‌పోర్టు పక్కనే నేషనల్‌ హైవే అథారిటీ నిర్మిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగానే ఎన్‌హెచ్‌ఏఐ భారీ క్రేన్‌ను వినియోగించింది.

ఇదీచదవండి..సూరీడు కనిపించి ఏడు రోజులైంది

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)