Breaking News

ఎయిమ్స్‌కు ఏచూరి భౌతికకాయం అప్పగింత

Published on Sat, 09/14/2024 - 18:32

న్యూఢిల్లీ: వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థీవదేహం ఎయిమ్స్‌కు చేరుకుంది. వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించిన అనంతరం.. అంతిమ యాత్ర సాగింది. ఆయన కోరిక మేరకే భౌతిక కాయాన్ని మెడికల్‌ రీసెర్చ్‌ కోసం ఎయిమ్స్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు.

ఈ ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం.. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.  కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ.. ఏచూరి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి ఆయన సతీమణిని ఓదార్చారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ సీఎం పినరయి విజయన్.. ఏచూరి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆప్‌ కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌,  వైఎస్సార్‌సీపీ తరఫున విజయసాయిరెడ్డి  కూడా దివంగత కామ్రేడ్‌కు నివాళులర్పించారు.

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి తొలుత జేఎన్‌యూ(JNU)కు తరలించి అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లారు. జేఎన్‌యూఎస్‌యూ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉంచగా.. వందల మంది విద్యార్థులు ‘‘లాల్‌సలాం’’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన కమ్యూనిస్టు యోధుడికి పుష్పాంజలి ఘటించారు. 

క్లిక్‌ చేయండి: వామపక్ష దిగ్గజ నేత జీవితంలో ప్రత్యేక క్షణాలు

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు