Breaking News

‘ఆర్‌జీ కర్‌’ విధ్వంసం సీపీఎం నేతల పనే 

Published on Tue, 08/26/2025 - 05:18

కోల్‌కతా: 2024 ఆగస్ట్‌ 14వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో జరిగిన విధ్వంసానికి వామపక్ష నేతలే కారణమని కోల్‌కతా పోలీసులు ఆరోపిస్తున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మీనాక్షీ ముఖర్జీ సహా 54 మంది పేర్లతో కూడిన నివేదికను సియల్డా కోర్టుకు సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలు దేబాంజన్‌ దేవ్, కలతన్‌ దాస్‌గుప్తా, సీపీఎంఎల్‌ మాజీ నేత దిధితి రాయ్, సీపీఎం నేత దీపూ దాస్‌ పేర్లు కూడా చార్జిషీటులో ఉన్నాయి. 

ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో పనిచేసే ట్రెయినీ వైద్యురాలు ఆగస్ట్‌ 9వ తేదీన దారుణ హత్యాచారానికి గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిపై దాడి జరిగింది. ఆస్పత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఎమర్జెన్సీ వార్డులో విధ్వంసం సృష్టించారు. అడ్డుకోబోయిన పలువురు వైద్యాధికారులతోపాటు పోలీసులు సైతం గాయపడ్డారు. దీనికి సంబంధించి కోల్‌కతా పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని, కాల్‌ డేటా రికార్డులను పరిశీలించడంతోపాటు ప్రత్యక్ష సాకు‡్ష్యలు, బాధితులను వందలాది మందిని ప్రశ్నించారు. మీనాక్షీ ముఖర్జీని కూడా ప్రశ్నించారు. వీరంతా కోల్‌కతాలోని ఓ సీపీఎం నేత ఇంట్లో సమావేశమై ధ్వంస రచన చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. చార్జిషీటును పరిశీలించిన సియల్డా కోర్టు మేజి్రస్టేట్‌ సోమవారం మీనాక్షీ ముఖర్జీ సహా పలువురికి సమన్లు జారీ చేశారు. వీరంతా కోర్టు ఎదుట లొంగిపోయారు. కోర్టు వీరికి ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేసింది.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)