Breaking News

మళ్లీ విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Published on Tue, 09/10/2024 - 14:23

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం మళ్లీ విష‌మించింది.  సీపీఎం పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్‌పై చికిత్స జ‌రుగుతుందని వెల్లడించింది. 

‘‘సీతారాం ఏచూరికి తీవ్ర‌మైన శ్వాస‌కోస ఇన్‌ఫెక్ష‌న్ జ‌రిగింది. ప్ర‌స్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతున్నా.. పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల బృందం ఏచూరిని నిశితంగా పరిశీలిస్తోంది’’ అని సీపీఎం పార్టీ ఎక్స్‌ అకౌంట్‌లో పోస్టు పెట్టింది.

కాగా ఆగ‌స్టు 19వ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్‌ అమర్చారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. దీంతో ఆయన కోలుకుంటున్నారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు పార్టీ వెల్లడించింది. 

 ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో కటీఫేనా?.. రెండో జాబితా కూడా విడుదల

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)