Breaking News

Monu Manesar: గోసంర‌క్ష‌కుడు మోను మ‌నేస‌ర్‌ అరెస్ట్‌

Published on Tue, 09/12/2023 - 16:16

వివాదాస్పద గోసంరక్షుడు, బజరంగ్‌దళ్‌ సభ్యుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని భివానీలో ఇద్దరు వ్యక్తుల హత్య, నూహ్‌లో అల్లర్లను ప్రేరేపించిన కేసులో మోను మనేసర్‌ను మంగళవారం సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌నేస‌ర్‌ను హ‌ర్యానా పోలీసులు రాజ‌స్ధాన్ పోలీసుల‌కు అప్ప‌గించ‌నున్నారు. కాగా గత ఫిబ్రవరిలో హర్యానాలో ఇద్దరు ముస్లింలను సజీవ దహనం చేసిన కేసులో మోనుపై కేసు నమోదైంది. 

శాంతి భద్రతల విభాగం అడిషనల్‌ డీజీపీ మమతా సింగ్‌ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా అభ్యంతరకరమైన పోస్టుపై మోనును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌పై మోనూ వాంటెడ్‌గా ఉన్న ఇతర రాష్ట్రాల్లోని పోలీసులకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు. రాజస్థాన్‌ పోలీసులు మోను మనేసర్‌ను కోర్టు ద్వారా కస్టడీలో తీసుకోవచ్చని తెలిపారు.

అసలెవరీ మోను మనేసర్‌
మోను మనేసర్‌ అలియాస్‌ మోహిత్‌ యాదవ్‌ బజరంగ్‌దళ్‌ సభ్యుడు. అంతేగాక గో సంరక్షుడు కూడా. ఇతరు గురుగ్రామ్‌లోని మనేసర్‌ ప్రాంతానికి చెందినవాడు. ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరిని కారుతో సహా సజీవ దహనం చేసిన కేసులో మోను కీలక నిందితుడిగా ఉన్నాడు. 

అదే విధంగా హర్యానాలోని నూహ్‌లో కొన్ని రోజులపాటు మతపరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హిందువులు తలపెట్టిన ర్యాలీపై మరో వర్గం వారు రాళ్లు రువ్వడంతో రాష్ట్రంలో చెలరేగిన హింసలో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు చనిపోయారు.. అయితే ఈ యాత్రలో మానేసర్ పాల్గొన్నాడనే సమాచారంతోనే కొందరు దాడికి తెగబడ్డారు. వాహనాలను దగ్ధం చేశారు.

కాగా రాజస్థాన్‌ భరత్‌పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నసీర్, జునైద్‌లను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజే హర్యానాలోని లోహారులో ఓ కారులో కాలిపోయిన స్థితిలో వారి మృతదేహాలు గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.  రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసి మోను మనేసర్‌ను నిందితుడిగా చేర్చారు. 
చదవండి: ‘భారత్‌ మండపం’ పరిస్థితి ఏమిటి? ఎవరైనా బుక్‌ చేసుకోవచ్చా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)