Breaking News

మధ్యవర్తిత్వంతో వివాదాలు  పరిష్కరించుకోవాలి 

Published on Sun, 02/16/2025 - 05:23

ముంబై:  అన్ని రకాల వివాదాలను కోర్టురూమ్‌ల దాకా తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా చెప్పారు. కొన్ని వివాదాలు కోర్టురూమ్‌ల్లో విచారణకు సరిపడవని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో చాలాసార్లు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయని, మనుషుల మధ్య బంధాలు బలపడతాయని వెల్లడించారు.

 వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక చక్కటి మార్గమని పేర్కొన్నారు. శనివారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ(ఎంఎన్‌ఎల్‌యూ) మూడో స్నాతకోత్సవంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మాట్లాడారు. ప్రతి కేసునూ చట్టపరమైన అంశం అనే కోణంలో చూడొద్దని, వాటిని మానవీయ కథనాలుగా పరిగణించాలని చెప్పారు. 

మన దేశంలో కక్షిదారులకు న్యాయ సహాయం అందించే వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటిది బహుశా ఎక్కడా లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. మన దగ్గర కక్షిదారులందరికీ ఏదోరకంగా న్యాయ సహాయం లభిస్తోందన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తగానే కోర్టుల్లో వ్యాజ్యాలు, విచారణల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. 

మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అని వివరించారు. అక్కడ కొన్నిసార్లు అవును లేదా కాదు అనే మాటలతోనే వివాదాలు పరిష్కారమవుతుంటాయని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనుషుల మధ్య, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు బలపడతాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉద్ఘాటించారు.   
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)