Breaking News

జయలలిత ఆస్తులను వివరాలను ఇవ్వండి!

Published on Wed, 01/25/2023 - 20:09

ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆపీసర్‌(పీఓఐ) ఉత్తర్వును సివిల్‌ కోర్టు కొట్టేసింది. అలాగే ప్రత్యేక కోర్టు ఆదేశించిన ఉత్తర్వుల మేరకు దివగంత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని పీఓ అధికారిని కోర్టు ఆదేశించింది. 1996 డిసెంబర్‌ 11న జప్తు చేసిన ఆస్తుల వేలానికి సంబంధించి ప్రత్యేక కోర్టు ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహమూర్తి కోరారు.

వాస్తవానికి జయలలిత ఆదాయనికి మించిన ఆస్తుల కేసును 2003లో సుప్రీం కోర్టు కర్ణాటకకు బదిలీ చేసింది. ఈ మేరకు జయలలిత చీరలు, శాలువాలు, పాదరక్షలతో సహా స్వాధీనం చేసుకుని బెంగళూరుకి తరలించారు. ఐతే 2014లో జయలలితతోపాటు, ఇతర నిందితులను ఇక్కడి ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. కానీ ఈకేసుకి సంబంధించిన భౌతిక ఆధారాలు కస్టడీలోనే ఉన్నాయి.

ఆయా ఆస్తులను ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి వేలం వేయాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌(పీఐఓ) నిరాకరించారు. పైగా ఆయన సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. ఐతే సివిల్‌ కోర్టు ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వుల తోపాటు కోర్టు నియమించిన ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ ముందు ఆస్తుల వివరాలను వెల్లడించాలని అధికారులను ఆదేశించింది. 

(చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్‌వాద్‌ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)