రూ. 1000తో రూ. 1.50 లక్షల బంగారం.. వింత టోకరా

Published on Mon, 03/03/2025 - 10:01

ఆ బంగారు నగల దుకాణంలో వింత మోసం చోటుచేసుకుంది. కస్లమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయాన్న విషయాన్ని దుకాణం యజమాని చాలా ఆలస్యంగా గుర్తించాడు. వెంటనే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని సుల్తాన్‌పూర్‌లోని ఒక నగల దుకాణంలో మోసం జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. బంగారు నగల దుకాణంలోనికి కస్టమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానికి ముందుగా రూ.1000 చెల్లించి, రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలను ఎంచుకుని, కొద్దిసేపటి తరువాత వస్తామని చెప్పి దుకాణం నుంచి వెళ్లిపోయారు.  అయితే సాయంత్రం దాటినా వారు తిరిగి దుకాణానికి రాలేదు. దీంతో దుకాణం యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే అతను సీసీటీవీ ఫుటేజ్‌(CCTV footage)ను పరిశీంచి, దానిలోని దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనలో మోసపోయిన నగల దుకాణం యజమాని కృష్ణచంద్ర మాట్లాడుతూ తమ దుకాణానికి కస్టమర్లుగా వచ్చిన ఒక పురుషుడు, ఒక మహిళ తనను బంగారు హారం, గొలుసు చూపించమని అడిగారన్నారు. వాటిని తాను చూపించాక వారు అడ్వాన్స్(Advance) గా వెయ్యి రూపాయలు చెల్లించి, పది నిముషాల్లో తిరిగి వచ్చి, మిగిలిన మొత్తం చెల్లించి, వస్తువులు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. అయితే వారిద్దరూ సాయంత్రం దాటినా రాకపోయేసరికి తనకు అనుమానం వచ్చి, దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించగా  వారు రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలతో పారిపోయారని గుర్తించానన్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కృష్ణచంద్ర పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)