Breaking News

లిపిస్టిక్‌తో గోడపై మెసేజ్‌ : జంట అనుమానాస్పద మరణం

Published on Wed, 11/26/2025 - 12:36

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని   దంపతుల ఆత్మహత్య (?) కలకలం రేపింది.  పదేళ్లు కలతలు లేకుండా కాపురం చేసిన  భార్యాభర్తలు అనుమానాస్పద పరిస్థితుల్లో  చనిపోయి కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది.  తొలుత  సంఘటనా కల్పించిన దృశ్యం  పోలీసులను  సైతం  దిగ్భ్రాంతికి గురిచేసింది.

సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని అటల్ ఆవాస్ కాలనీలో ఈ   హృదయ విదారక సంఘటన సంచలనం సృష్టించింది.  తొలుత భార్యభర్తల వివాదం అనుకున్నారు అంతా.  కానీ  లిప్‌స్టిక్‌తో  గోడలపై రాసిన  మెసేజ్‌  పోలీసులను నివ్వెర పోయేలా చేసింది.  దీంతి ఇది హత్య లేక ఆత్మహత్యా అనే అనుమానాలను దారి తీసింది. నవంబర్ 24న, రాజ్ లేదా నేహా మధ్యాహ్నం వరకు ఇంటి నుండి బయటకు రాకపోవడంతో,  అనుమానం వచ్చిన నేహా తల్లి రీనా   అక్కడి వెళ్లి పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కంటతడి పెట్టించే దృశ్యాలు 
మృతులు శివాని తండే అలియాస్‌ నేహా,  రాజ్‌ది  ప్రేమ వివాహం. వీరు  ప్రైవేట్ కంపెనీలో క్లీనర్లుగా పనిచేస్తున్నారు.  వీరికి ముగ్గురు చిన్న పిల్లలున్నారు. ముప్పై ఏళ్ల  నేహా, మంచం మీద చనిపోయి కనిపించగా, ఆమె భర్త రాజ్  సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. గోడలపై లిపిస్టిక్‌తో రాసిన రాతలు.. మృతుల  ఇంటి లోపల, ఈ  భయంకర దృశ్యాలు పలువురి  కంట తడిపెట్టించాయి.  

ఇంతకీ ఏముందీ  ఆ మెసేజ్‌లో 
గోడలపై రాసిన ఆ మెసేజ్‌లో రాజేష్ విశ్వాస్ అనే వ్యక్తి పేరు ,మొబైల్ నంబర్ ఉన్నాయి.  అతని కారణంగా చనిపోతున్నామని, తమ సంసారంలో కలతలు రేపాడని ఆరోపించరాఉ. పిల్లలూ .. ఐ లవ్‌ యూ అంటూ మరో  భావోద్వేగ నోట్ రాశారు. ఆ సందేశంలో భార్య ఫోన్ కాల్స్ కారణంగా తరచుగా గొడవలు జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అనుమానాలతో  ఇద్దరి మధ్యా మధ్య తరచూ గొడవలు జరిగేవని పొరుగువారు వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు నేహా మెడపై గీతలు పడిన గుర్తులను కనుగొన్నారు. దీంతో గొంతు కోసి భార్యని చంపిన రాజ్‌, ఆ తరువాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టు బావిస్తున్నారు.  గది నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ , గోడల మీద రాతల ఆధారం హత్య-ఆత్మహత్య అనే వాదనకు బలం చేకూరుస్తోంది.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)