Breaking News

అవినీతి నిరోధక సంస్థలో రూ.5 కోట్ల హైఎండ్‌ కార్లా? మండిపడుతున్న నెటిజన్లు

Published on Tue, 10/21/2025 - 17:21

దేశంలోని అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ అయిన లోక్‌పాల్ (Lokpal)  హై ఎండ్‌ లగ్జరీ కార్లకోసం అన్వేషిస్తోంది. దీనికి సంబంధించి ప్రముఖ ఏజెన్సీల నుండి ఓపెన్ టెండర్లను ఆహ్వానిస్తోందన్న వార్త నెట్టింట తీవ్ర చర్చకు తెరతీసింది.అక్టోబర్ 16న జారీ చేసిన నోటిఫికేషన్‌లో లోక్‌పాల్‌ 7 BMW లగ్జరీ కార్లను కోరుకుంటోంది. వాటి ధర ఒక్కొక్కటి రూ. 70 లక్షలు. BMW 3 సిరీస్ Li కార్లను ఏడింటిని కొనుగోలు చేయడానికి టెండర్‌ను పిలిచింది, ఛైర్‌పర్సన్, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్‌తో సహా ప్రతి సభ్యునికి  ఒకటి చొప్పున వీటిని కేటాయించనున్నారు.  

అంతేకాదు కార్ల తయారీ సంస్థ BMW లోక్‌పాల్ డ్రైవర్లు ,సిబ్బందికి ఏడు రోజుల 'శిక్షణ' అందించనుంది. ఈ శిక్షణలో కార్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు కార్యకలాపాలపై వారికి ట్రెయినింగి కూడా ఇవ్వాలట.  టెండర్ నోటీసు ప్రారంభ తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది.

 

విమర్శలు, నెటిజన్లు రియాక్షన్స్‌

ఈ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లోఆగ్రహాన్ని రేకెత్తించింది.  విలాసాలతో లోక్‌పాల్ ప్రతిష్టను మంటగలుపు తున్నారంటూ  ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్  మండిపడ్డారు. ఒకపుడు ‍జవాబుదారీతనానికి చిహ్నంగా ఉన్న లోక్‌పాల్ గౌరవం దిగజారుతోందని, సంస్థలో కీలక నియామకాలు చేపట్టలేని ప్రభుత్వం విలాసవంతమైన విదేశీ కార్లను ఎందుకు కొనుగోలు చేస్తోందని యూత్‌ కాంగ్రెస్  విభాగం  విమర్శలు గుప్పించింది.  ఇది సోషల్‌ మీడియాలో తీవ్ర  విమర్శలకు దారి తీసింది. ఇపుడు  ఒక్కొక్కిరికీ రూ. 70 లక్షల విలువైన కారు. తరువాత  రూ. 12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు అంటూ సెటైర్లు వేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)