Breaking News

Odisha Train Accident: ఆ దుర్ఘటనలో కీలకంగా ఆ లోకోపైలట్‌ చివరి మాటలు

Published on Mon, 06/05/2023 - 14:12

ఒడిశాలో బాలాసోర్‌ జిల్లాలో వందలాదిమంది ప్రాణాలు బలిగొన్న మూడు రైళ్ల ప్రమాదంలో ఆ లోకో పైలట్‌ చివరి మాటలే కీలకంగా మారనున్నాయి. ఈ ఘటనలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతోనే గూడ్స్‌ రైలుని ఢీ కొట్టినట్లు రైల్వేశాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. కానీ నిజానికి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ అందుకున్న తర్వాతే లూప్‌లైన్‌లోకి వెళ్లిందని, సిగ్నల్‌ జంప్‌ చేయలేదని లోకోపైలట్‌ గుణనిధి మొహంతి చెప్పారు.

మొదటగా మెయిన్‌లైన్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని ఆ తర్వాత వెంటనే మార్చబడిందని, అప్పుడే లూప్‌లైన్‌కి వెళ్లేలా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు వెల్లడించారు. అక్కడ గూడ్స్‌ రైలు ఆగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇక ఆ లోకోపైలట్‌  మొహంతి కూడా  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో డ్రైవర్‌ అతివేగం కాదని రైల్వే బోర్డు ఆపరేషన్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌​ సభ్యురాలు జయవర్శ సిన్హా కూడా ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ..సాక్ష్యాలు తారుమారు కాకుండా, ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఆ డ్రైవర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ అందుకున్న​ తర్వాత ముందుకు సాగినట్లు తెలిపారు. అతను సిగ్నల్‌ జంప్‌ చేయలేదని, అలాగే అతి వేగంతో కూడా వెళ్లలేదని తేల్చి చెప్పారు సిన్హా.

అతనకి నిర్దేశించిన గరిష్ట వేగంతోనే రైలుని ముందకు తీసుకువెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని సిన్హా వెల్లడించారు. ఇదిలా ఉండగా, రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇన్విస్టెగేషన్‌(సీబీఐ) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆ లోకో పైలట్‌ మొహంతి మాటలే దర్యాప్తులో కీలకం కానుండటం గమనార్హం. 

(చదవండి:

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)