Breaking News

నాకేమీ తెలియదు, మొబైల్‌ పోయింది

Published on Sun, 06/02/2024 - 08:07

బనశంకరి: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్టైన హాసన్‌ జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ అధికారులు బెంగళూరులో విచారణ చేపట్టారు. ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నిరాకరిస్తున్నట్లు సిట్‌ వర్గాలు తెలిపాయి. ఇది రాజకీయకుట్ర, అనవసరంగా తనకు ఈ కేసులో ఇరికించారు. మీ పని మీరు చేయండి, నేనేమీ చెప్పను అని మొండికేసినట్లు తెలిసింది. ప్రశ్నలను తమ న్యాయవాదిని అడగాలని చెప్పిన ప్రజ్వల్‌ శుక్రవారం విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 

తన మొబైల్‌ఫోన్‌ ఏడాది కిందట చోరీ అయ్యిందని, మీరు అడుగుతున్న మొబైల్‌ఫోన్‌  తన వద్ద లేదని సిట్‌ అధికారులకు చెప్పారు. అశ్లీల వీడియోలలో ఉన్నది మీరే కదా అని చూపించగా, ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదని, వారందరూ తనకు పరిచయం అంతే, నేను ఎవరిపై అత్యాచారానికి పాల్పడలేదని ప్రజ్వల్‌ చెప్పినట్లు సమాచారం.   దీంతో విచారణను ఎలా సాగించాలని సిట్‌ అధికారులు తలపట్టుకున్నారు. 

నేడో రేపో ఘటనాస్థలికి 
శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విచారించి భోజనం అందజేశారు. శనివారం  కూడా విచారణ కొనసాగించారు. ఆదివారం లేదా సోమవారం హాసన్, హొళెనరసిపురలోని ఇళ్లకు ప్రజ్వల్‌ను తీసుకెళ్లి సంఘటనలు ఎలా జరిగాయో మహజరు పరిచే అవకాశముంది.  

ముందస్తు బెయిలు కోసం తల్లి అర్జీ  
ప్రజ్వల్‌ కేసులో ఓ బాధిత మహిళను అపహరించారనే కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన తల్లి భవానీ రేవణ్ణ శనివారం హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని సిట్‌ గతంలో నోటీసులు జారీచేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో పరారీలో ఉన్నారని భవానీ కోసం సిట్‌ గాలిస్తోంది.  ముందస్తు బెయిల్‌కోసం భవానీ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించగా అర్జీని తిరస్కరించింది. అరెస్ట్‌ చేస్తారనే భయంతో భవానీ  హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం పిటిషన్‌ విచారణ కు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో భవాని నివాసానికి ముగ్గురు మహిళా న్యాయవాదులు వెళ్లారు. వారు ఆమె తరఫున సిట్‌ అధికారులతో చర్చించారు. విచారణకు హాజరవుతారని, అరెస్టు కోసం ఒత్తిడి చేయరాదని సిట్‌ను కోరారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)