దేశభక్తి నినాదాలపై నిషేధమా?

Published on Thu, 11/27/2025 - 06:00

కోల్‌కతా: పార్లమెంట్‌ లోపల ఎంపీలు జైహింద్, వందేమాతరం అనే నినాదాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నట్లు వచ్చిన వార్తలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇందులో నిజం ఎంతవరకు ఉందో తనకు తెలియదని, ఎంపీలతో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకుంటానని చెప్పారు. బుధవారం కోల్‌కతాలో రాజ్యాంగ దినోత్సవంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. 

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించిన నినాదాలను నిషేధిస్తే మన గుర్తింపును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుందని వెల్లడించారు. వందేమాతరం మన జాతీయ గీతమని గుర్తుచేశారు. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం నినాదం అందరినోట మార్మోగిందని, ఈ విషయం మర్చిపోవద్దని కోరారు. 

పార్లమెంట్‌ లోపల జైహింద్, వందేమాతరం నినాదాలను అడ్డుకోవాలన్న ఆలోచన సరైంది కాదని సూచించారు. బెంగాల్‌కు చెందిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్‌ రాయ్‌ని బీజేపీ నాయకులు కించపరుస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్‌ గడ్డను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. బెంగాల్‌ కూడా భారతదేశంలో భాగమేనని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)