Breaking News

మళ్లీ కష్టాల్లో ‘జననాయకన్‌’

Published on Thu, 01/22/2026 - 05:18

తమిళ సినిమా (చెన్నై): జననాయకన్‌ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ.. ఆ సినిమాను సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నాయి. విజయ్‌ కథానాయకుడిగా, హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ నిరి్మంచిన చిత్రం జననాయకన్‌ సినిమాను చిక్కులు చుట్టుముడుతున్నాయి. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఆడియో వేదికపై విజయ్‌ మాట్లాడుతూ.. ‘నా చిత్రాలకు ఉత్తి పుణ్యానే సమస్యలు ఎదురవుతాయి. వాటిని మీరు ఎదురొడ్డి నిలబడగలరా’ అని నిర్మాతను అడిగినట్టు చెప్పారు. 

ఆయన ఏ ఉద్దేశంతో అలా అన్నారోగానీ.. జననాయకన్‌ చిత్రం సెన్సార్‌ చిక్కుల్లో పడింది. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ఇప్పటివరకూ పరిష్కారం రాలేదు. ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ రూపంలో ఈ చిత్ర నిర్మాతకు మరో ఇబ్బంది తలెత్తింది. 

విజయ్‌ చిత్రం కావడంతో దీని ఓటీటీ హక్కులను భారీ మొత్తంలో చెల్లించి అమెజాన్‌ సంస్థ కొనుగోలు చేసింది. సాధారణంగా చిత్రం విడుదలైన నాలుగు వారాల్లో ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్‌ చేస్తాయి. అలాంటి ఒప్పందమే జననాయకన్‌ చిత్ర నిర్మాతతో అమెజాన్‌ సంస్థ కుదుర్చుకుంది. ఈ చిత్రం ఇప్పటికీ విడుదల కాకపోవడంతో అమెజాన్‌ సంస్థ చిత్ర నిర్మాత నుంచి నష్టపరిహారం కోరడానికి సిద్ధమైనట్టు సమాచారం. 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)