Breaking News

ఉత్తరాదిని ‘కమ్ముకున్న పొగమంచు’

Published on Tue, 12/26/2023 - 04:40

సాక్షి, న్యూఢిల్లీ: చలి పులికి ఉత్తరాది రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మంచుతెరలు దట్టంగా పరుచుకున్నాయి. ఢిల్లీసహా ఆరు రాష్ట్రాల విమానాశ్రయాల్లో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతంగా ఉండటంతో రన్‌వే కూడా కనిపించని పరిస్తితి ఏర్పడింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఏర్పడటంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ, అమృత్‌సర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, గ్వాలియర్, జైసల్మేర్‌ విమానాశ్రయాల్లో జీరో విజిబిలిటీ నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే కొద్ది రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనావేసింది. ప్రతికూల వాతావరణ ప్రభావంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం పొగమంచు కారణంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది.  

ప్రాణం తీసిన పొగమంచు!
బహ్రెయిచ్‌(యూపీ): దట్టంగా కమ్ముకున్న పొగమంచు ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైంది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌–బల్‌రామ్‌పూర్‌ రహదారిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మంచుదుప్పటి కప్పిన రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. డ్రైవర్లతో పాటు ఒక ప్రయాణికుడు మరణించాడు. 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)