Breaking News

చెట్లపై మంచు ముత్యాలు.. వీధుల్లో చలిమంటలు!

Published on Mon, 12/18/2023 - 11:39

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో చలిగాలులు స్థానికులను గజగజా వణికిస్తున్నాయి. తీవ్రమైన చలికి తోడు విపరీతంగా మంచు కురుస్తుండటంతో మొక్కలు, చెట్లు మంచుతో నిండిపోతున్నాయి. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. 

చలి తీవ్రత దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని  ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సామాన్యుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కూడళ్లు, జనావాసాల వద్ద  చలి మంటలు వెలిగించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కుందన్‌కుమార్‌ జిల్లా మున్సిపల్‌ ముఖ్య అధికారులు, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారులను ఆదేశించారు.

గత కొన్ని రోజులుగా అంబికాపూర్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు నిరంతరం పడిపోవడానికితోడు, చలిగాలులు చుట్టుముడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్‌ అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు. చలి మంటలు వేసేందుకు కలప వినియోగాన్ని తగ్గించాలని, పేడ పిడకలను ఉపయోగించాలని సూచించారు. చలిగాలుల విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. అవసరమైన సందర్భంలో వైద్యులను సంప్రదించాలని సలహా ఇచ్చారు. 
ఇది కూడా చదవండి: 2023.. భారత్‌లో సంభవించిన భారీ  అగ్ని ప్రమాదాలివే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)