Breaking News

17న హర్యానా సీఎం ‍ప్రమాణ స్వీకారం

Published on Sat, 10/12/2024 - 13:04

చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్ 17న నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం  చేయించనున్నారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం హర్యానాలోని పంచకుల సెక్టార్ 5లోని పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు  హాజరుకానున్నారు. అక్టోబరు 17న పంచకులలో సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రధాని ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.

త్వరలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని, అందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. నయాబ్ సింగ్ సైనీని ఎమ్మెల్యేలు  అధికారికంగా తమ నేతగా ఎన్నుకోనున్నారని సమాచారం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నయాబ్‌ సింగ్ సైనీ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది.

ఇటీవల నయాబ్‌ సింగ్ సైనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

 



ఇది కూడా చదవండి: ‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’

 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)