సీఎంకు క్లీన్‌చిట్‌ వచ్చేసిందా?

Published on Fri, 01/24/2025 - 08:50

బనశంకరి: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన మైసూరు ముడా ఇళ్ల స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది, మరికొందరిపై కేసు నమోదు కావడం తెలిసిందే. ఇందులో విచారించిన రాష్ట్ర లోకాయుక్త.. సీఎంకు, ఆయన సతీమణి పార్వతికి క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. లోకాయుక్త పోలీసులు సీఎంతో పాటు ఇతరులను పిలిచి విచారించారు. ఆ నివేదికను రూపొందించి సోమవారం మైసూరులో కోర్టుకు సమర్పించారు. అందులో సీఎం దంపతులకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు అధికారులు ఉల్లంఘనకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపాయి. ఏదేమైనా నివేదిక అధికారికంగా బయటకు వస్తేనే పూర్తి వివరాలు తేటతెల్లమవుతాయి.   

నాకు తెలియదు: స్నేహమయి 
ఈ కేసులో ఫిర్యాదిదారు స్నేహమయి కృష్ణ స్పందిస్తూ క్లీన్‌చిట్‌ ఇవ్వడం గురించి తనకు తెలియదన్నారు. ఇది తన పోరాటానికి ఎలాంటి అడ్డంకి కాదని, సీఎం హస్తం లేకుండా అధికారులు అక్రమాలకు పాల్పడటం సాధ్యం కాదని, ఇందులో సిద్దరామయ్య పాత్ర ఉందని ఆరోపించారు.  

నాకు కూడా తెలియదు: సీఎం  
ముడా కేసులో తనకు, భార్యకు లోకాయుక్త క్లీన్‌చిట్‌ ఇచ్చారనేది తెలియదని సీఎం సిద్దరామయ్య అన్నారు. గురువారం విధానసౌధలో విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా ఇంకా తెలియదన్నారు. తాను ఐదేళ్లు పదవిలో ఉండాలా అనేది హైకమాండ్‌ తీసుకునే నిర్ణయమని అన్నారు. బడ్జెట్‌  పనుల వల్ల దావోస్‌ టూర్‌కి వెళ్లలేదని, గత ఏడాది కూడా వెళ్లలేదని చెప్పారు.    

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)