Breaking News

ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు..

Published on Sat, 06/17/2023 - 11:27

గుజరాత్‌:గుజరాత్‌లోని జునాగఢ్‌లో అక్రమంగా నిర్మించిన దర్గా కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. దర్గా కూల్చివేత నోటీసులు జారీ చేయడానికి వెళ్లిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులపై అందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మృతి చెందగా..పలువురు పోలీసులు గాయపడ్డారు. 

దర్గాను అక్రమంగా నిర్మించారని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ క్రమంలో అధికారులు దర్గాపై కూల్చివేతకు సంబంధించిన నోటీసులను జారీ చేయడానికి వెళ్లగా.. ఆందోళనకారులు అధికారులను అడ్డగించారు. అనంతరం అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసు పోస్టును కూల్చివేశారు. దాదాపు 300 మంది నిరసనకారులు దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.  

నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయు గోళాలను ఉపయోగించారు. ఈ అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. ముగ్గురు పోలీసులతో సహా ఓ డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 174 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:Cyclone Biparjoy: బలహీనపడిన బిపర్‌జోయ్‌.. గుజరాత్‌ నుంచి రాజస్తాన్‌ వైపు పయనం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)