Breaking News

నాగ్‌పూర్‌లో చెలరేగిన అల్లర్లు    

Published on Tue, 03/18/2025 - 06:03

నాగ్‌పూర్‌: మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చేస్తామనే విశ్వహిందూ పరిషత్‌ చేసిన డిమాండ్లతో మొదలైన ఉద్రిక్తతలు చివరకు అల్లర్లకు దారితీశాయి. ఇందుకు సెంట్రల్‌ నాగ్‌పూర్‌ ప్రాంతం వేదికైంది. సోమవారం ఒక మతగ్రంథానికి నిప్పుపెట్టారన్న పుకార్లు షికార్లు చేయడంతో ఒక వర్గం ఆందోళనకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తెచ్చే ప్రయత్నంచేయంతో వారిపైనా రాళ్లు రువ్వారు. దీంతో జరిగిన ఘర్షణల్లో 20 మంది గాయపడ్డారు. 

నాగ్‌పూర్‌లో రా్ ష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యాలయం ఉండే మహల్‌ ప్రాంతంలో ఘర్షణలకు దిగిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీచేశారు. భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. 15 మందిని అరెస్ట్‌చేశారు. ఘర్షణలు సాయంత్రంకల్లా కోత్వాలీ, గణేష్‌పేట్‌ ప్రాంతాలకూ పాకాయి. కూబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టిన డీసీపీ నికేతన్‌ కదమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

 శుక్రవారీ తలావ్‌రోడ్‌లోని ఛిత్నిశ్‌ పార్క్‌ వద్ద ఆందోళనకారులు చెలరేగిపోయారు. ఇక్కడ పలువాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలు నివాస గృహాలపై రాళ్లు రువ్వారు. హింసను విడనాడాలని, శాంతియుతంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్, నాగ్‌పూర్‌ నుంచి కేంద్ర మంత్రి అయిన నితిన్‌ గడ్కరీ విజ్ఞప్తిచేశారు. మహల్‌ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహం వద్ద బజరంగ్‌దళ్‌ సభ్యులు ఆందోళన చేపట్టిన తర్వాతే ఉద్రిక్త పరిస్తితి తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. 

ఇక్కడ ఒక మతగ్రంథాన్ని తగలబెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇది నిజమని నమ్మిన మరో వర్గం సభ్యులు మహల్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనకు దిగాక పరిస్థితి అదుపుతప్పింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్, రాష్ట్ర రిజర్వ్‌ పోలీస్‌ బలగాలను భారీ ఎత్తున మొహరించారు. పలుచోట్ల నిషేధాజ్ఞలు జారీచేశారు. ఛిత్నిశ్‌ పార్క్‌ వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఔరంగజేబు దిష్టిబొమ్మను మాత్రమే దగ్ధం చేశామని బజరంగ్‌దళ్‌ వర్గాలు స్పష్టంచేశాయి.   
 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)