Breaking News

అయోధ్యలో దీపావళికి రెండు లక్షల దీపకాంతులు

Published on Tue, 10/08/2024 - 07:53

అయోధ్య: రాబోయే దీపావళి నాడు అయోధ్యలో లక్షలాది దీపాలు వెలగనున్నాయి. రామాయణ యుగాన్ని తలపించే విధంగా అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నారు.

ఈసారి దీపావళికి ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల దీపాలు వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ట్రస్ట్ చైనా వస్తువులు,  దీపాలను నిషేధించింది. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి నాడు శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చే దృశ్యాలను పునశ్చరణ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భారత్ భిన్నత్వం కలిగిన దేశమని, మనమంతా పండుగలను ఎలా, ఎప్పుడు జరుపుకోవాలనే వివరాలను పండితుల నుంచి తెలుసుకుంటామన్నారు. జన్మాష్టమి వంటి పండుగలను నక్షత్రం, ఆరోజు ఉదయం ఉన్న తిథి ప్రకారం జరుపుకుంటారని తెలిపారు. కాశీ పంచాంగాన్ని  అనుసరించి దీపావళి అక్టోబర్‌ 31న వచ్చిందన్నారు.

ఇది కూడా చదవండి: 30 కోట్లకు విమాన ప్రయాణికులు

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)