Breaking News

బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి మృతి

Published on Sat, 06/15/2024 - 10:03

గుజరాత్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున  ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు.

రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి చిక్కుకుపోయింది. తమ కుమార్తె మృతి చెందడంలో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోక సంద్రంగా మారిపోయింది. ప్రమాద స్థలంలో అంబులెన్స్ , అగ్నిమాపక దళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయి. బాలికకు ఆక్సిజన్ అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

అగ్నిమాపక దళ అధికారి హెచ్‌సీ గాధ్వి  మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది వయసుగల ఆ చిన్నారికి పాలు తాగించిన తరువాత తల్లిదండ్రులు పనులకు వెళ్లారన్నారు. ఇంతలో వారికి తమ కుమార్తె కేకలు వినపించాయి. వారి కుమార్తె బోరు బావిలో పడిపోయిందని అక్కడున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు.

వెంటనేవారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులను, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ బృందం ఆ చిన్నారి బోరుబావిలోని 50 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారి తలకిందులుగా ఉందని, ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్  సరఫరా చేశారు. తరువాత రోబోట్ మెషీన్‌ను కూడా పిలిపించారు. అది ఆ చిన్నారి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి చేరుకుంది. బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)