Breaking News

ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎవరు? నేటితో చర్చలకు తెర?

Published on Sun, 12/10/2023 - 07:11

ఛత్తీస్‌గఢ్‌కు నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపిక అవుతారనేదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. సీఎం ఎంపికకు బీజేపీ పరిశీలకులను నియమించింది. ఈ నేపధ్యంలో నేడు (ఆదివారం) శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిలో సీఎం పేరు ఖరారు కావచ్చని భావిస్తున్నారు. అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లను బీజేపీ ఛత్తీస్‌గఢ్ పరిశీలకులుగా నియమించింది. రాష్ట్ర ఇన్‌చార్జి ఓం మాథుర్, రాష్ట్ర కో-ఇన్‌చార్జ్ నితిన్ నబిన్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా సింగ్, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయి, రాంవిచార్ నేతమ్, అరుణ్ సావో, ఓపీ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. 

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులను ప్రకటించింది. వీరు ఎమ్మెల్యేలతో చర్చలు సాగించి సీఎం పేర్లను ప్రకటిస్తారు. అనంతరం మూడు రాష్ట్రాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కాగా మూడు రాష్ట్రాల్లో జరిగే ప్రమాణస్వీకారోత్సవాలు జరిగే తేదీలపై చర్చ పార్టీలో జరుగుతోంది.
ఇది కూడా చదవండి: అందరికీ ‘రామ్‌ రామ్‌’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)