Breaking News

‘ఆమె మహిళా హక్కుల పరిరక్షకురాలు’

Published on Sat, 08/31/2024 - 06:12

న్యూఢిల్లీ: జస్టిస్‌ హిమా కోహ్లి ఒక మహిళా జడ్జి మాత్రమే కాదని స్త్రీ హక్కుల పరిరక్షణకు తీవ్రంగా పాటుపడ్డారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కితాబిచ్చారు. సెప్టెంబరు 1న రిటైరవుతున్న హిమా కోహ్లి గౌరవార్థం సీజేఐ శుక్రవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఆమె రిటైరయ్యాక సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు.. జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలు  ఉంటారు.

 ‘జస్టిస్‌ కోహ్లితో కలిసి ధర్మాసనంపై కూర్చోవడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. హిమా.. మీరొక మహిళా జడ్జి మాత్రమే కాదు.. స్త్రీల హక్కుల పరిరక్షకురాలు కూడా’ అని సీజేఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో చంద్రచూడ్, హిమాకోహ్లిలు బ్యాచ్‌మేట్లు కావడం గమనార్హం. 

న్యాయం కోసం జస్టిస్‌ కోహ్లి తన జీవితాన్ని ధారబోశారని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి అన్నారు. 2006 మే నెలలో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన హిమా కోహ్లి.. 2007 ఆగస్టులో శాశ్వత జడ్జి అయ్యారు. జనవరి 7, 2021న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)