Breaking News

గ్రామాలకూ న్యాయవిద్య: సీజేఐ

Published on Mon, 02/19/2024 - 05:04

న్యూఢిల్లీ: న్యాయ విద్య కోర్సులను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ఇంగ్లిష్‌ మాట్లాడని విద్యార్థులను సైతం న్యాయవిద్యలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ నేషనల్‌ లా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

సాంకేతికత మనకు సుదూరప్రాంత విద్యార్థులకు సైతం చేరువయ్యే సామర్థ్యాన్ని అందించింది. న్యాయ విద్య ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, ఆంగ్లం మాట్లాడే పట్టణ ప్రాంత పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఇది అనుకూలంగా ఉంది’అని అన్నారు. ‘ఇటీవల అయిదు లా యూనివర్సిటీల్లో ఓ సర్వే చేపట్టాం. విభిన్న భాషా నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులు కేవలం ఇంగ్లిష్‌లో మాట్లాడ లేకపోవడమే కారణంతో ఈ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నట్లు సర్వేలో తేలింది’అని సీజేఐ వెల్లడించారు.

భాషా పరమైన అవరోధాలను అధిగమించేందుకు భాషిణి సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉందన్నారు. ఇందులో సుప్రీంకోర్టు 1950–2024 మధ్య వెలువరించిన 36 వేల పైచిలుకు తీర్పులను తర్జుమా చేసి ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి కోర్టుల్లో ఇంగ్లిష్‌ మాట్లాడలేని న్యాయవాదులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. న్యాయవిద్యను హిందీలో బోధిస్తే ఉత్తమ విద్యార్థులు తయారవుతారని వర్సిటీ యంత్రాంగానికి ఆయన సూచించారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)