Breaking News

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు.. ఒక్కసారిగా కలకలం

Published on Thu, 11/06/2025 - 18:47

బిలాస్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. లోకో పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడం ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కోట్మి సోనార్- జైరామ్‌నగర్ స్టేషన్ల మధ్య ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు ఒకేసారి వచ్చాయి.

ఒక ప్యాసింజర్ రైలు ముందు, వెనుక రెండు గూడ్స్‌ రైళ్లు ఉన్నట్లు సమాచారం. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇటీవల ఇదే రాష్ట్రంలో గూడ్స్‌ రైలును ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లోకో పైలట్‌ సహా 11 మంది మృతి మరణించారు.

ఆ ఘటన మరవకముందే.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు రావడంపై రైల్వే పనితీరుపై ప్రశ్నలు తలెత్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యం అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎందుకు ఉన్నాయనే అంశంపై బిలాస్‌పూర్ డివిజన్ సీనియర్ డీసీఎం అనురాగ్ కుమార్ సింగ్ స్పష్టతనిస్తూ.. ఇది నిర్లక్ష్యం కాదని, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సాంకేతిక ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో రైల్వే వ్యవస్థపై తప్పుదారి పట్టించే సమాచారం వ్యాప్తి చేస్తున్నారని డీసీఎం అన్నారు. వాస్తవానికి, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ కింద, రైళ్లను దాదాపు 90 మీటర్ల నిర్ణీత దూరంలో ఒకే ట్రాక్‌పైకి తీసుకురావచ్చు. ఇది పూర్తిగా సాంకేతికంగా సురక్షితమైన ప్రక్రియ అని ఆయన వెల్లడించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)