Breaking News

లోన్‌ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్‌ మేనేజర్‌!

Published on Mon, 12/09/2024 - 20:55

చత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్‌ మేనేజర్‌.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్‌ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్‌కు కోళ్ల ఫారమ్‌ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్‌ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ను కలిశాడు. లోన్‌ ఇస్తానని చెప్పిన మేనేజర్‌ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్‌ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్‌ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్‌ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.

ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్‌ కోసం 10 శాతం కమిషన్‌ కూడా డిమాండ్‌ చేశాడు. దాంతో అతను తన ఫారమ్‌లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్‌ కోసం 10 శాతం కమిషన్‌ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్‌ లోన్‌ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్‌ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్‌ తనకు లోన్‌ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

తాను కొనుగోలు చేసి మేనేజర్‌కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్‌ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్‌పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్‌బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)