Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్‌బీఐ’ శాఖ

Published on Mon, 09/30/2024 - 05:45

జంజ్‌గిర్‌–చంపా(ఛత్తీస్‌గఢ్‌): ఆన్‌లైన్‌ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్‌ బ్రాంచ్‌ వద్దకే. అలాంటి బ్యాంక్‌ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్‌డ్‌’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. 

శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్‌ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్‌ సామగ్రితో ఎస్‌బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. 

దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్‌బీఐ రీజనల్‌ ఆఫీస్‌ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. 

బ్యాంక్‌ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్‌ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్‌ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)